AI కెమెరాతో Vivo కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే

వివో కంపెనీ ఇండియా మార్కెట్లో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Vivo T3 Lite 5G’.

Update: 2024-06-27 09:51 GMT

దిశ, టెక్నాలజీ: వివో కంపెనీ ఇండియా మార్కెట్లో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Vivo T3 Lite 5G’. ముఖ్యంగా ఇది దమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP64-రేటెడ్‌తో వచ్చింది. గురువారం విడుదలైనప్పటికి అమ్మకానికి మాత్రం జులై 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. Flipkart, Vivo India వెబ్‌సైట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ ప్రారంభ ధర రూ.10,499, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 11,499. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు లభిస్తాయి. ఫోన్ మెజెస్టిక్ బ్లాక్, వైబ్రంట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.

Vivo T3 Lite 5G స్పెసిఫికేషన్స్

* 6.56-అంగుళాల HD+ (1,612 x 720 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌

* 90Hz రిఫ్రెష్ రేట్, 840nits బ్రైట్‌నెస్

* ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ ఉంది.

* ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14తో రన్ అవుతుంది.

* బ్యాక్‌సైడ్ AI మద్దతు గల 50MP+2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది.

* 5,000mAh భారీ బ్యాటరీని అందించారు.

* సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Similar News