టెక్ ప్రపంచంలో సరికొత్త డివైజ్‌ను ఆవిష్కరించిన Apple

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఎంతో ఆదరణ ఉంటుంది. నాణ్యత కారణంగా ప్రజల్లో యాపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఉంది

Update: 2023-06-06 13:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఎంతో ఆదరణ ఉంటుంది. నాణ్యత కారణంగా ప్రజల్లో యాపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ అత్యాధునికమైన ప్రోడక్ట్స్‌లను అత్యంత నాణ్యతతో తయారుచేస్తుంది. తాజాగా ఇప్పుడు కంపెనీ నుంచి కొత్త ప్రోడక్ట్ ఒకటి విడుదలైంది. దాని పేరు ‘Apple Vision Pro’. ఇది వీడియోలను వర్చ్యువల్‌గా, రియల్ ప్రపంచం అనుభూతిని అందించే 3D హెడ్‌సెట్. దీని ధర 3,500 డాలర్లు(రూ.2,88,742). WWDC 2023 ఈవెంట్‌లో కంపెనీ సీఈఓ టీమ్‌కుక్ దీనిని ఆవిష్కరించారు. వీటిని Apple Goggles అని కూడా అంటారు.


దీనిలో 12 కెమెరాలు, 6 మైక్రోఫోన్లు, పలు సెన్సార్లను అమర్చారు. సెన్సార్ల ద్వారా చేతులు, కళ్లతోటే వివిధ రకాల యాప్‌లను కంట్రోల్ చేయవచ్చు. ఇది చూడటానికి హెడ్‌సెట్, కళ్ళద్దాల మాదిరిగా ఉన్నప్పటికి లోపల మాత్రం వీడియోలను అత్యంత నాణ్యతతో 3D అనుభూతిని అందిస్తుంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కొత్త ఇంటర్‌ఫేస్‌ను "స్పేషియల్ కంప్యూటింగ్"గా అభివర్ణించారు.




Tags:    

Similar News