మరిన్ని దేశాలకు శాటిలైట్ ఆధారిత ఫోన్ కాల్స్
ఎమర్జెన్సీ టైంలో వినియోగదారులకు సహయపడటానికి శాటిలైట్ ఆధారిత(SOS)ని తీసుకొచ్చిన ఆపిల్ సంస్థ, ఇప్పుడు ఆ సదుపాయాన్ని మరిన్ని దేశాలకు విస్తరించింది
దిశ, వెబ్‌డెస్క్: ఎమర్జెన్సీ టైంలో వినియోగదారులకు సహయపడటానికి శాటిలైట్ ఆధారిత(SOS)ని తీసుకొచ్చిన ఆపిల్ సంస్థ, ఇప్పుడు ఆ సదుపాయాన్ని మరిన్ని దేశాలకు విస్తరించింది. ఇది ఫోన్‌లో సిగ్నల్స్, Wi-Fi అందుబాటులో లేనప్పుడు, iPhone యూజర్లు శాటిలైట్ ద్వారా ఇతరులకు కనెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. iOS 16.1 లేదా తర్వాతి వెర్షన్‌లో నడుస్తున్న iPhone 14, iPhone 14 Pro మోడల్‌లలో ఉపగ్రహం ద్వారా అత్యవసర SOSని సేవలను పొందవచ్చు.
మొదటగా ఈ ఫీచర్ కెనడాలో మాత్రమే అందుబాటులో ఉండేది. తరువాత UK, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్‌లకు విస్తరించింది. ఇప్పుడు కొత్తగా ఆరు దేశాలు.. ఆస్ట్రియా, బెల్జియం, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పోర్చుగల్‌లోని వినియోగదారులకు ఈ నెలలో ఈ ఫీచర్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఏదైనా అత్యవసర సమయంలో సిగ్నల్స్ లేని చోటు నుండి సహాయం పొందడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు మొదలగువారితో కమ్యూనికేట్ కావడానికి శాటిలైట్ ఆధారిత(SOS) ఫీచర్, ఎంపిక చేసిన ఆపిల్ ఫోన్లలో యూజర్లకు అందుబాటులో ఉంది.