Apple Iphone : రూ.1,600 కే యాపిల్ ఐఫోన్!

మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా ? మనలో చాలా మంది బ్రాండ్ ఫోన్లను ఇష్ట పడుతుంటారు

Update: 2023-02-24 03:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా ? మనలో చాలా మంది బ్రాండ్ ఫోన్లను ఇష్ట పడుతుంటారు. వాటిలో ముందు వరసలో ఉండేది యాపిల్ ఐఫోన్ కోసం.ఈ ఫోనును మన సొంతం చేసుకోవాలంటే చేతిలో ఎనభై , తొంబై వేలు లేనిదే దీన్ని కొనలేము. కానీ ఇప్పుడు మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు..కొత్త ఆప్షన్ ఒకటి అందుబాటులోకి తెచ్చారు. అది ఏంటంటే మీరు ఐఫోన్ కొనుగోలు చేయకుండా రెంట్ కు తీసుకోవచ్చు.. ఈ ఆప్షన్ ఇంత వరకు ఎక్కడా వినలేదు కదా .. అయితే పూర్తిగా ఈ కంటెంట్ చదివి వివరాలను తెలుసుకోండి.

యాపిల్ ఐఫోన్ రెంట్ కు తీసుకోవాలనుకుంటే ..దీనిలో చాలా మోడళ్లు ఉన్నాయి. వాటిలో XR మోడల్ గురించి ఇక్కడ చూద్దాం. ఈ ఐఫోన్ రెంటుకు తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. మీరు పతి నెల రూ. 1649 చెల్లించాలి. ఈ ప్లాన్ రెండు విధాలుగా ఉంది. అది 6 నెలల, 12 నెలల ప్లాన్ ఉంది . అయితే ముందు మీరు రిఫండబుల్ అమౌంట్ రూ. 4200 డిపాజిట్ చేయాలి. మీ టెన్యూర్ అయిపోయిన తరువాత ఫోన్ తిరిగి ఇవ్వాలిసి ఉంటుంది.  

Tags:    

Similar News