GPS ట్రాకింగ్, రూట్ నావిగేషన్ ఫీచర్‌తో Amazfit స్మార్ట్‌వాచ్
Amazfit కంపెనీ నుంచి కొత్తగా ఒక స్మార్ట్‌వాచ్ ఎంపిక చేసిన దేశాల్లో విడుదల అయింది. ఈ మోడల్ పేరు ‘Amazfit Bip 5’.
దిశ, వెబ్‌డెస్క్: Amazfit కంపెనీ నుంచి కొత్తగా ఒక స్మార్ట్‌వాచ్ ఎంపిక చేసిన దేశాల్లో విడుదల అయింది. ఈ మోడల్ పేరు ‘Amazfit Bip 5’. ఇది అమెరికా, UK ఇతర కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. త్వరలో ఇండియాలోకి రానుంది. దీని ధర దాదాపు రూ. 7,400. ఈ వాచ్ 1.91-అంగుళాల (320x380 పిక్సెల్‌లు) TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది టెంపర్డ్ గ్లాస్, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌ను కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు, రియల్ టైమ్ GPS ట్రాకింగ్, రూట్ నావిగేషన్ కోసం నాలుగు శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఇస్తుంది.
దీనిలో హెల్త్ పరంగా బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, హార్ట్ రేట్ ట్రాకర్, స్ట్రెస్ లెవల్స్ మానిటర్‌తో సహా అనేక స్మార్ట్ హెల్త్ మానిటర్‌లను కలిగి ఉంది. సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ స్విమ్మింగ్, ఇండోర్ స్పోర్ట్స్‌తో సహా 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ అందిస్తుంది. ఈవెంట్ రిమైండర్‌లు, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, ఫైండ్ మై ఫోన్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. దీనిలో 300mAh బ్యాటరీని అందించారు. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
Read More : అధునాతన ప్రాసెసర్‌తో మార్కెట్లోకి యాపిల్ వాచ్ సిరీస్ 9