మీ వాట్సాప్ డీపీ స్క్రీన్ షాట్ తీసుకుంటారని భయపడుతున్నారా.. ఇలా చేయండి!
టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా యూత్ నుంచి 60 సంవత్సరాలు పై బడిన వారు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతూ వాట్సాప్ యూస్ చేస్తుంటారు.
దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా యూత్ నుంచి 60 సంవత్సరాలు పై బడిన వారు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతూ వాట్సాప్ యూస్ చేస్తుంటారు. అయితే కొంత మంది వాట్సాప్ యూస్ చేస్తున్నప్పుడు కాస్త అసౌకర్యానికి గురి అవుతుంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, తమ వాట్సాప్ డీపీ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో అని భయపడి, డీపీ పెట్టుకోవడమే మానేస్తుంటారు.
అయితే దానిని నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా వాట్సాప్ సరికొత్త ఫీచర్ తో మీ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ప్రొఫైల్ ఫోటోలు మిస్ యూజ్ అవుతున్న ఘటనలు చూశాం. ఈ నేపథ్యంలో యూజర్స్ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని, వాట్సాప్ ఫ్రొఫైల్ పిక్చర్‌కు సైతం ప్రైవసీ అందిస్తోంది. దీని ద్వారా మీ డీపీ ఎవరి ఎవరికి కనిపించాలో మీరే సెట్ చేసుకొని పెట్టుకోవచ్చంట. ఒక వేళ ఎవరైనా మీ డీపీని స్క్రీన్ షాట్ తీసినప్పుడు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తోందంట. దీంతో ఎవరూ మీ డీపీనీ స్క్రీన్ షాట్ తీయలేరు. స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ప్రొఫైల్ ఫొటో పేరుతో ఈ ఫీచర్‌ను తీకొస్తున్నారు. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌లో పరీక్షిస్తున్నారు. కాగా, ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇక యూజర్స్ పర్సనల్ సమాచారం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మెటా తెలిపింది.