మరింత సులభంగా WhatsApp చాటింగ్!
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్, చాటింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి యానిమేటెడ్ ఎమోజీలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్, చాటింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి యానిమేటెడ్ ఎమోజీలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. చాటింగ్ టైంలో స్టిక్కర్‌లు, ఎమోజీలను మరింత సులభంగా యాడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం, ఈ యాప్, చాటింగ్ అనుభవాన్ని మరింత ఉల్లాసంగా మార్చేలా యానిమేటెడ్ ఎమోజీలకు సంబంధించిన లైబ్రరీని త్వరలో విడుదల చేయనుంది. ప్రస్తుతం, ఈ ఫీచర్‌ను కంపెనీ పరీక్షిస్తుంది. టెస్టింగ్ పూర్తయ్యాక అందరికీ అందించనుంది. ఇప్పటికే ఇలాంటి ఫీచర్ టెలిగ్రామ్‌లో ఉంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, WhatsApp నుండి కూడా యానిమేటెడ్ ఎమోజీలను పంపవచ్చు.