Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. యూజర్లకు ఇక పండుగే..!
భారత్‌లో టిక్ టాక్ నిషేధం తర్వాత అత్యంత ప్రజాధారణ పొందిన యాప్ ఇన్‌స్టాగ్రామ్. ముఖ్యంగా యువతులు, మహిళలు ఈ యాప్ చూడకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు.
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో టిక్ టాక్ నిషేధం తర్వాత అత్యంత ప్రజాధారణ పొందిన యాప్ ఇన్‌స్టాగ్రామ్. ముఖ్యంగా యువతులు, మహిళలు ఈ యాప్ చూడకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. తమకు నచ్చిన పాటలకు డ్యాన్స్‌లు, డైలాగ్స్‌లకు రీల్స్ చేయడం దినచర్యగా పెట్టుకున్నారు. ఇలా తమ అకౌంట్లకు ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ఇది ఓ బిజినెస్ అడ్డగా మారిపోయింది. సెలబ్రిటీలు సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాపార, వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు. పోస్టుకు ఇంతా అంటూ రేటు కడుతున్నారు. ఇలాంటి వారికి కాసుల వర్షం కురిపించేలా ఇన్‌స్టాగ్రామ్ అదిరిపోయే అప్ డేట్‌ను తీసుకువస్తోంది.
2017లో ఎంట్రీ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అప్ డేట్ అవుతూ వస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకేసారి 20 ఫొటోల(ఫైల్స్)ను అప్ లోడ్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు 10 ఫొటోలు మాత్రమే అప్ లోడ్ చేసుకునే వెసలుబాటు ఉన్నది. ఇకపై దాని సంఖ్యను 20 వరకు పెంచుతూ అప్ డేట్ చేస్తున్నారు. త్వరలో ఈ వర్షన్ అప్ డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానం కంటెంట్ క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వ్యాపారులకు లాభదాయకంగా ఉన్నా యూజర్లు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఒకే యూజర్‌కు చెందిన 20 ఫైళ్లను చూడటానికి నెటిజన్స్ ఆసక్తి చూపుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. కానీ పెయిడ్ ప్రమోషన్స్ చేసే వారికి ఈ విధానం కాసుల వర్షం కురిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.