Asteroid:ఆ రోజు భూమికి దగ్గరగా రానున్న భారీ గ్రహశకలం..నాసా ఏం చెబుతుందంటే?

అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు సంచరిస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే అవి తమదైన ఒక గమ్య స్థానంలో పరిమిత వేగంతో ప్రయాణం చేస్తుంటాయి.

Update: 2024-07-07 09:16 GMT

దిశ,వెబ్‌డెస్క్: అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు సంచరిస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే అవి తమదైన ఒక గమ్య స్థానంలో పరిమిత వేగంతో ప్రయాణం చేస్తుంటాయి. కానీ వీటికి భిన్నంగా ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహశకలం గంటకు 65 వేల కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని సైంటిస్టులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇది భూమికి సమీపంలో వెళ్తుందని నాసా తెలిపింది. అయితే ఈ గ్రహ శకలంతో భూమికి ఏమైనా ప్రమాదం ఉందా? గ్రహశకలం నుంచి ఎదురయ్యే ముప్పును తప్పించడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలకు నాసా ఏం చెబుతుందంటే..స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పరిమాణంలో ఉండే భారీ గ్రహ శకలం భూమివైపు దూసుకొస్తోందని తాజాగా నాసా వెల్లడించింది. రేపు (జులై 8న) ఇది భూమికి అతి సమీపంగా రానున్నట్లు నాసా తెలిపింది. గంటకు 65,215 కి.మీ వేగంతో భూమి వైపుకు దూసుకు వస్తున్నట్లు ప్రకటించింది. 260 ఫీట్ల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలం గమనాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. ఇది 15 లక్షల కి.మీ దూరంలో భూమిని దాటి వెళ్తుందని తెలిపారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.


Similar News