వాట్సాప్‌లో సెండ్ అయిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకునే ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇప్పుడు మళ్లీ ఇంకొక సదుపాయాన్ని తీసుకురానుంది. ఇతరులకు సెండ్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేయడానికి వినియోగదారులను అనమతించే ఫీచర్‌ను తెస్తుంది. దీనికి సంబంధించి WhatsApp ఇప్పటికీ iOS బీటా ప్లాట్‌ఫారమ్‌లో మెసేజ్‌లను ఎడిట్ చేయడానికి ఒక ఫీచర్‌పై పని చేస్తోంది.
దీని ద్వారా పంపిన మెసేజ్‌లో ఏదైనా పొరపాటును సరిచేయడానికి లేదా అసలు మెసేజ్‌కు ఏదైనా అదనపు సమాచారాన్ని చేర్చడానికి, మెసేజ్‌లను సవరించడానికి వినియోగదారులకు 15 నిమిషాల వరకు సమయం ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇది సక్సెస్ అయ్యాక పూర్తి స్థాయిలో అన్ని ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.