కేవలం ఐదు నిమిషాల్లో 100 శాతం ఫుల్ చార్జ్.. మార్కెట్లోకి 300W చార్జర్
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చార్జింగ్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. నిమిషాల్లో పూర్తి చార్జ్ అయ్యే హై కెపాసిటీ చార్జర్‌లు, కంపటబుల్ స్మార్ట్ ఫోన్లు చాలా వరకు మార్కెట్లో లాంచ్ అయ్యాయి
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చార్జింగ్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. నిమిషాల్లో పూర్తి చార్జ్ అయ్యే హై కెపాసిటీ చార్జర్‌లు, కంపటబుల్ స్మార్ట్ ఫోన్లు చాలా వరకు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Redmi చార్జింగ్ గురించి కీలక ప్రకటన చేసింది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 300W చార్జింగ్ టెక్నాలజీని తీసుకువచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇది ఐదు నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా చార్జ్ చేస్తుందని తెలిపింది. కొత్త చార్జింగ్ టెక్నాలజీకి "300W ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్" అని పేరు పెట్టారు.
ఇంతకు ముందు Realme GT Neo5 స్మార్ట్‌ఫోన్‌లో 240W చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేశారు. ఇది కేవలం 9 నిమిషాల 30 సెకన్లలో 0% నుండి 100%, కేవలం 4 నిమిషాల్లో 0% నుండి 50% వరకు చార్జ్ అవుతుంది. కానీ, చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబో ప్రకారం, 4,100mAh బ్యాటరీతో ఉన్న స్మార్ట్ ఫోన్‌ను Redmi 300W వైర్డ్ చార్జర్, 43 సెకన్లలో 10 శాతం, 2 నిమిషాల్లో 50 శాతం, 5 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ చేస్తున్నట్లు చూపించింది.