Netflixకు షాక్ ఇచ్చిన యూజర్లు
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్లు షాక్ ఇచ్చారు. పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టాలనే ఉద్ధేశ్యంతో మొదటి సారిగా పాస్‌వర్డ్ షేరింగ్‌కు ఫీజు వసూలు చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్లు షాక్ ఇచ్చారు. పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టాలనే ఉద్ధేశ్యంతో మొదటి సారిగా పాస్‌వర్డ్ షేరింగ్‌కు ఫీజు వసూలు చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం తీసుకుంది. దీనిని మొదటి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో స్పెయిన్‌లో అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై వ్యతిరేకత కారణంగా భారీగా యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ను వీడారు. మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ కాంటర్ ప్రకారం 2023 మొదటి మూడు నెలల్లో దాదాపు 10 లక్షల మంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌కు గుడ్‌బై చెప్పారు. ఫిబ్రవరి ప్రారంభంలో, నెట్‌ఫ్లిక్స్ స్పెయిన్‌లోని వినియోగదారులు తమ లాగిన్ వివరాలను మరొకరి షేర్ చేయడానికి నెలకు $6.57 వసూలు చేయాలని నిర్ణయించింది.