భారత్ లో నెలకు సగటున 19.5GB డేటా వాడుతున్నారు

Update: 2023-02-16 14:43 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ల వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. యూ ట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ తదితర ప్లాట్ ఫామ్ ల్లో యూజర్లు బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ లో ఇంటర్ నెట్ డేటా వినియోగం బాగా పెరిగింది. నోకియా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం.. గతేడాదితో పోలిస్తే డేటా వినియోగం ఈసారి 13.6 శాతం పెరిగింది. ఒక్కో భారతీయుడు నెలకు సగటున 19.5 జీబీ డేటా వాడుతున్నట్లు రిపోర్టులో వెల్లడించారు.

మొబైల్ ఫోన్లకు సంబంధించిన డేటా వినియోగం గత ఐదేళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగింది. 2022కు సంబంధించి మొత్తం డేటా వినియోగంలో 4 జీ నెట్ వర్క్ 99 శాతం షేర్ తో అగ్రభాగాన ఉన్నట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. రాబోవు రోజుల్లో డేటా వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read...

రూ. 7 వేల లోపు ధరలో అమెజాన్‌లో కొత్త స్మార్ట్ ఫోన్

Tags:    

Similar News