వన్డే సిరీస్‌లో భారత్ బోణీ

దిశ, వెబ్‌డెస్క్: పుణె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించడంతో విజయం భారత్ వసమైంది. ఒక దశలో ఇంగ్లండ్ ఓపెనర్లు జానస్ రాయ్, బెయిర్ స్టో భారీగా పరుగులు చేయడంతో ఆ జట్టు గెలుస్తుందేమోనని అందరూ భావించారు. కానీ ఓపెనర్లు ఔట్ అయిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఓపెనర్లు రాయ్, బెయిర్ స్టో […]

Update: 2021-03-23 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుణె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించడంతో విజయం భారత్ వసమైంది. ఒక దశలో ఇంగ్లండ్ ఓపెనర్లు జానస్ రాయ్, బెయిర్ స్టో భారీగా పరుగులు చేయడంతో ఆ జట్టు గెలుస్తుందేమోనని అందరూ భావించారు.

కానీ ఓపెనర్లు ఔట్ అయిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఓపెనర్లు రాయ్, బెయిర్ స్టో మినహా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేకపోవడంతో తొలి వన్డే విజయం భారత్ ఖాతాలోకి చేరిపోయింది.

ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 317/5 పరుగులు చేసింది. దీంతో 318 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 251 పరుగులతో 42.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను భారత్ కైవసం చేసుకోవడంతో 1-0 ఆధిక్యంలో భారత్ ఉంది.

Tags:    

Similar News