న్యూజిలాండ్‌పై టీమిండియా భారీ విజయం.. రికార్డులు బ్రేక్

దిశ, వెబ్‌డెస్క్ : ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజు 140/5 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఆట ప్రారంభమైన గంటలోనే 167 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ ధాటికి కివీస్ లోయర్ ఆర్డర్ కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు జయంత్ యాదవ్ 4, అశ్విన్ 4, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ […]

Update: 2021-12-05 23:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజు 140/5 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఆట ప్రారంభమైన గంటలోనే 167 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ ధాటికి కివీస్ లోయర్ ఆర్డర్ కుప్పకూలింది.

రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు జయంత్ యాదవ్ 4, అశ్విన్ 4, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ జట్టుపై 372 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే విజయంలో పరుగుల తేడా(372)పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇంతకు ముందు టీమిండియా 337 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై 2015లో విజయం అందుకుంది.

Ind Vs Nz : రికార్డులు బద్దలు కొట్టిన రవిచంద్రన్ అశ్విన్..

Tags:    

Similar News