మే నెలాఖరులో ఇంగ్లాండ్‌కు టీమ్ ఇండియా
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెటర్లు మరోసారి బయోబబుల్‌లోకి వెళ్లనున్నారు. జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ జరుగనున్నది. ఐపీఎల్ వాయిదా పడకుంటే జూన్ మొదటి వారంలో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. ఇప్పుడు ఐపీఎల్ అర్దాంతరంగా వాయిదా పడటంతో ఇండియన్ క్రికెటర్లు మే చివరి వారంలో ఇంగ్లాండ్ చేరుకునేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఇండియాను రెడ్ లిస్ట్‌లో […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెటర్లు మరోసారి బయోబబుల్‌లోకి వెళ్లనున్నారు. జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ జరుగనున్నది. ఐపీఎల్ వాయిదా పడకుంటే జూన్ మొదటి వారంలో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. ఇప్పుడు ఐపీఎల్ అర్దాంతరంగా వాయిదా పడటంతో ఇండియన్ క్రికెటర్లు మే చివరి వారంలో ఇంగ్లాండ్ చేరుకునేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఇండియాను రెడ్ లిస్ట్‌లో పెట్టింది. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులకు 10 రోజుల క్వారంటైన్ కంపల్సరీ చేసింది. దీంతో ముందుగానే టీమ్ ఇండియా క్రికెటర్లు ఇంగ్లాండ్ చేరుకోనున్నారు. పది రోజుల క్వారంటైన్ తర్వాత ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ ఏర్పాటు చేసే బయోబబుల్‌లోకి ప్రవేశించనున్నారు. న్యూజీలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత అగస్టు-సెప్టెంబర్ నెలలో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నది. దీంతో మే నెలాఖరు నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు నాలుగు నెలలు టీమ్ ఇండియా క్రికెటర్లు బయోబబుల్‌కు పరిమితం కానున్నారు.