టీం ఇండియా టార్గెట్ @420
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఇక మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ బర్న్స్(0)ను అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం కూడా అదే తరహాలో వరుసగా మరో రెండు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించాడు. భారీ ఆధిక్యం దిశగా సాగుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లకు బ్రేకులు వేశాడు. మొత్తం తొలిటెస్టులో ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను […]
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఇక మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ బర్న్స్(0)ను అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం కూడా అదే తరహాలో వరుసగా మరో రెండు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించాడు. భారీ ఆధిక్యం దిశగా సాగుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లకు బ్రేకులు వేశాడు. మొత్తం తొలిటెస్టులో ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టించాడు. అంతేగాకుండా భారత బౌలర్లందరూ ఉత్తమ ప్రతిభ కనబర్చి ఇంగ్లాండ్ భారీ టార్గెట్ నిర్దేశించకుండా అడ్డుకోగలిగారు. మొత్తంగా ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో టీమిండియాకు 420 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. భారత బౌలర్లలో ఇషాంత్, బూమ్రా చెరో వికెట్ తీయగా.. నదీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక అశ్విన్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను అడ్డుకున్నాడు. ప్రస్తుతం భారత్ టార్గెట్ 420 పరుగులు చేయాల్సి ఉంది. జట్టు ఆశలన్నీ కూడా క్రీజులో ఉన్న అశ్విన్, సుందర్‌పైనే ఉన్నాయి.