సాధన మొదలు పెట్టిన టీమ్ ఇండియా

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగనున్న 2వ టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుండటంతో టీమ్ ఇండియా సాధన ముమ్మరం చేసింది. తొలి టెస్టు ఓటమి తర్వాత లోపాలను సరి చేసుకుంటూ.. సరికొత్త వ్యూహాలతో భారత జట్టు బరిలోకి దిగనున్నది. ఇందుకు గాను ముందుగానే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ గురువారం పూర్తిగా నెట్స్‌లో సాధన చేశారు. రోహిత్ శర్మ, గిల్, రహానే బ్యాటింగ్‌ ప్రాక్టీస్ […]

Update: 2021-02-11 11:13 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగనున్న 2వ టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుండటంతో టీమ్ ఇండియా సాధన ముమ్మరం చేసింది. తొలి టెస్టు ఓటమి తర్వాత లోపాలను సరి చేసుకుంటూ.. సరికొత్త వ్యూహాలతో భారత జట్టు బరిలోకి దిగనున్నది. ఇందుకు గాను ముందుగానే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ గురువారం పూర్తిగా నెట్స్‌లో సాధన చేశారు. రోహిత్ శర్మ, గిల్, రహానే బ్యాటింగ్‌ ప్రాక్టీస్ చేయగా.. కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై ఫోకస్ చేశాడు.

తొలి టెస్టులో గాయపడిన అక్షర్ పటేల్.. నెట్స్‌లో కోహ్లీకి బౌలింగ్ చేస్తూ కనపడ్డాడు. షాబాజ్ నదీమ్ బదులు అక్షర్ రెండో టెస్టులో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, రెండో టెస్టు భారత జట్టుకు కీలకంగా మారడంతో తుది జట్టు కూర్పుపై కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తున్నది. రహానేపై కూడా కాసేపు చర్చ జరిగినట్లు సమాచారం.

Tags:    

Similar News