లాక్‌డౌన్‌పై టీమ్ ఇండియా క్రికెటర్ల స్పందన

కరోనా మహమ్మరిని కట్టడి చేయాలనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణను అరికట్టేందుకు లాక్‌డౌన్‌కు మించిన పరిష్కారం లేదని, 21 రోజులు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ‘ప్రధాని మోడీ 21 రోజుల పాటు దేశం యావత్తు లాక్‌డౌన్‌లోకి వెళ్తుందని ప్రకటించారు. నేను కూడా అభ్యర్థిస్తున్నాను.. దయచేసి అందరూ […]

Update: 2020-03-25 03:36 GMT

కరోనా మహమ్మరిని కట్టడి చేయాలనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణను అరికట్టేందుకు లాక్‌డౌన్‌కు మించిన పరిష్కారం లేదని, 21 రోజులు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ‘ప్రధాని మోడీ 21 రోజుల పాటు దేశం యావత్తు లాక్‌డౌన్‌లోకి వెళ్తుందని ప్రకటించారు. నేను కూడా అభ్యర్థిస్తున్నాను.. దయచేసి అందరూ ఇండ్లలోనే ఉండండి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. చతేశ్వర్ పుజారా, హర్భజన్ సింగ్ కూడా లాక్‌డౌన్‌కు మద్దతుగా ట్వీట్ చేస్తూ.. ‘ఈ 21 రోజులు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి.. దయచేసి బాధ్యతాయుతంగా ఉందామని’ కోరారు. కరోనాను అరికట్టడమే మన ముందు ఉన్న ఏకైక మార్గమని వారు ట్వీట్ చేశారు.

Tags: Virat Kohli, Pujara, Harbhajan Singh, Corona effect, Lockdown, Tweet

Tags:    

Similar News