ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ రికార్డ్
దిశ, వెబ్‌డెస్క్: రన్ మెషీన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో 74 పరుగులతో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ సందర్భంగా తన టెస్టు కెరీర్‌లో అడిలైడ్ ఓవల్ మైదానంలో మొత్తం 492 పరుగులు చేసి ఆస్ట్రేలియా గడ్డపై రికార్డు సృష్టించాడు. అంతేగాకుండా వరుసగా ఇదే స్టేడియంలో 116, 22, 115, 141, 3, 34, 74 పరుగులు చేశాడు కోహ్లీ. […]
దిశ, వెబ్‌డెస్క్: రన్ మెషీన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో 74 పరుగులతో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ సందర్భంగా తన టెస్టు కెరీర్‌లో అడిలైడ్ ఓవల్ మైదానంలో మొత్తం 492 పరుగులు చేసి ఆస్ట్రేలియా గడ్డపై రికార్డు సృష్టించాడు. అంతేగాకుండా వరుసగా ఇదే స్టేడియంలో 116, 22, 115, 141, 3, 34, 74 పరుగులు చేశాడు కోహ్లీ. అనుకోని తప్పిదం వల్ల ఈ మ్యాచ్‌లో కోహ్లీ 74 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. తొలి రోజు ఆట పూర్తయ్యేసరి టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 233 పరుగులు చేసింది.