29న ఉపాధ్యాయుల మహాధర్నా

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని కోరుతూ ఈనెల 29న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి( జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) ప్రకటించింది. స్టీరింగ్ కమిటీ సమావేశం సోమవారం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. స్టీరింగ్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటి వరకు జరిగిన రెండు దశల పోరాట కార్యక్రమాలను సమీక్షించారు. ఖాళీగా ఉన్న హైస్కూల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్స్‌తో పాటు పాత పది […]

Update: 2020-12-21 11:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని కోరుతూ ఈనెల 29న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి( జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) ప్రకటించింది. స్టీరింగ్ కమిటీ సమావేశం సోమవారం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. స్టీరింగ్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటి వరకు జరిగిన రెండు దశల పోరాట కార్యక్రమాలను సమీక్షించారు. ఖాళీగా ఉన్న హైస్కూల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్స్‌తో పాటు పాత పది జిల్లాల ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, పదోన్నతుల అనంతరం విద్యాశాఖ లో ఏర్పడే ఖాళీలన్నింటిలో నూతన ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని కోరారు.

Tags:    

Similar News