ఉపాధ్యాయులకు వినూత్నంగా విషెస్ చెప్పిన ప్రముఖులు
దిశ, సినిమా : టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద స్టార్ అయినప్పటికీ ఎప్పుడూ సింపుల్‌గా, డౌన్ టు ఎర్త్ కనిపించే మహేశ్.. తన విజయాలన్నింటికీ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మార్గదర్శనమే కారణమని చెబుతుంటాడు. కాగా టీచర్స్ డే సందర్భంగా తండ్రికి థాంక్స్ చెబుతూ హార్ట్‌ఫెల్ట్ నోట్‌తో పాటు త్రో బ్యాక్ పిక్ ఒకటి షేర్ చేశాడు. ‘ప్రతీరోజు నేర్చుకోవడాన్ని ఇష్టపడుతూ ఎదిగిన మనిషి.. ప్రేమించడం, బలంగా […]
దిశ, సినిమా : టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద స్టార్ అయినప్పటికీ ఎప్పుడూ సింపుల్‌గా, డౌన్ టు ఎర్త్ కనిపించే మహేశ్.. తన విజయాలన్నింటికీ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మార్గదర్శనమే కారణమని చెబుతుంటాడు. కాగా టీచర్స్ డే సందర్భంగా తండ్రికి థాంక్స్ చెబుతూ హార్ట్‌ఫెల్ట్ నోట్‌తో పాటు త్రో బ్యాక్ పిక్ ఒకటి షేర్ చేశాడు. ‘ప్రతీరోజు నేర్చుకోవడాన్ని ఇష్టపడుతూ ఎదిగిన మనిషి.. ప్రేమించడం, బలంగా నిలబడటం, క్రమశిక్షణ, కరుణతో పాటు వినమ్రత గురించి నాకు నేర్పించిన నాన్నకు ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నేర్చుకునేందుకు, ఎదిగేందుకు సాయపడిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను’ అని పోస్టు చేశాడు.
Here's to the love of learning and growing each day! Thanking my father who taught me to love, to be strong, to have discipline, compassion and humility. Will always be indebted to him and to everyone who's helped me learn and evolve in my journey. #TeachersDay pic.twitter.com/xZTSiGpsYk
— Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2021
ఇదిలా ఉంటే, టీచర్స్ డే విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఉపాధ్యాయ వృత్తిని అత్యుత్తమ ప్రొఫెషన్‌గా పేర్కొన్నాడు. ‘జ్ఞానాన్ని నలుగురికి పంచడం కంటే విలువైన వృత్తి మరొకటి లేదు. ఉపాధ్యాయులు.. మనల్ని సరైన మార్గంలో నడిపించే వెలుగు దివ్వెలు. జీవితంలోని ప్రతి దశలో ఒక ఉపాధ్యాయుడిని కనుగొంటాం. ప్రపంచంలోని టీచర్లందిరికీ హ్యాపీ టీచర్స్ డే’ అని ట్వీట్ చేశారు.
Imparting knowledge is the noblest of professions and the most precious.
Teachers are our guiding lights and catalysts for excellence! We find a Teacher at every stage of our lives.Happy #TeachersDay to All the Teachers of the world!— Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2021