చ‌దువుతో పాటు చాకిరి బాధ్యత గురువులదే

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను తొలంగించడంతో ఉపాధ్యాయులే పాఠశాలలు శుభ్రపరచుకొంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ పనులు చేయాలని ఉత్తర్వులు ఉన్నా, ఏదో ఒక రోజు చేయడం, తర్వాత పట్టించుకోవడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలను చూడలేక టీచర్లే స్వయంగా బాత్‌రూంలు క‌డుగుతున్నారు. గ‌దుల్లోని బూజును దులుపుతున్నారు. చ‌దువులు చెప్పాల్సిన గురువులు చివ‌రికి చీపుర్లు ప‌ట్టి అన్ని ప‌నులు చేసుకోవాల్సి రావ‌డంపై బాధ‌ప‌డుతున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దడం కోసం చాకిరి […]

Update: 2021-02-26 08:00 GMT

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను తొలంగించడంతో ఉపాధ్యాయులే పాఠశాలలు శుభ్రపరచుకొంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ పనులు చేయాలని ఉత్తర్వులు ఉన్నా, ఏదో ఒక రోజు చేయడం, తర్వాత పట్టించుకోవడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలను చూడలేక టీచర్లే స్వయంగా బాత్‌రూంలు క‌డుగుతున్నారు. గ‌దుల్లోని బూజును దులుపుతున్నారు.

చ‌దువులు చెప్పాల్సిన గురువులు చివ‌రికి చీపుర్లు ప‌ట్టి అన్ని ప‌నులు చేసుకోవాల్సి రావ‌డంపై బాధ‌ప‌డుతున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దడం కోసం చాకిరి చేయాల్సి వ‌స్తోందని ఆవేద‌న వ్యక్తం చేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బొడ్రాయి తండా ఉన్నత పాఠశాలను అక్కడి ప్రిన్సిపల్ ఇందిరా రాణి, టీచర్లతో కలిసి శుక్రవారం శుభ్రం చేశారు. పాఠశాలకు వచ్చే పిల్లల జాగ్రత్త తమకు ముఖ్యమని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని గురుత‌ర బాధ్యత‌ను వెల్లడించ‌డం విశేషం.

Tags:    

Similar News