‘ఆ జీవోలు వెంటనే విడుదల చేయాలి’
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా పీఆర్సీకి సంబంధించిన అంశాలపై వెంటనే జీఓలు జారీ చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి డిమాండ్ చేశారు. వచ్చేనెలలోనైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంపత్ కుమారస్వామి ప్రకటించారు. టీఈఏ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా పీఆర్సీకి సంబంధించిన అంశాలపై వెంటనే జీఓలు జారీ చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి డిమాండ్ చేశారు. వచ్చేనెలలోనైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంపత్ కుమారస్వామి ప్రకటించారు. టీఈఏ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అవలంభిస్తుందని ఆరోపించారు.
అదే విధంగా కరోనా ఫ్రంట్‌లైన్‌వారియర్స్ కుటుంబాలను ఆదుకోవాలని, కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం అందించి, ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. అంతేకాకుండా కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధులను ఎదుర్కొంటూ ప్రజలకు సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని, వారికి 25 శాతం రిస్క్ అలవెన్స్‌తో పాటు 10 శాతం అదనంగా వేతనం ఇవ్వాలని సంపత్ డిమాండ్ చేశారు. కరోనా వచ్చిన ఉద్యోగులకు 21 రోజుల స్పెషల్ క్యాజువల్ సెలవు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో టీఈఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు డా. జి. నిర్మల తదితరులు పాల్గొన్నారు.