గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి

దిశ ప్రతినిధి, మహాబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణ స్వామి గుండెపోటుతో శనివారం మృతిచెందారు. విషయం తెలిసిన పార్టీ నాయకులు నారాయణస్వామి లేని లోటు పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీతి నిజాయితీకి మారుపేరగా ఉంటూ, పార్టీ పెట్టిన దగ్గర నుంచి చివరివరకూ టీడీపీలోనే ఉండి పార్టీని బలోపేతమే లక్ష్యంగా పని చేశారని అన్నారు. లేబర్ యూనియన్ లీడర్‌గా అనేక పోరాటా నిర్వహించి, మంచి పేరును సంపాదించుకున్నారని స్పష్టం చేశారు. ప్రజల […]

Update: 2020-07-18 05:53 GMT

దిశ ప్రతినిధి, మహాబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణ స్వామి గుండెపోటుతో శనివారం మృతిచెందారు. విషయం తెలిసిన పార్టీ నాయకులు నారాయణస్వామి లేని లోటు పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీతి నిజాయితీకి మారుపేరగా ఉంటూ, పార్టీ పెట్టిన దగ్గర నుంచి చివరివరకూ టీడీపీలోనే ఉండి పార్టీని బలోపేతమే లక్ష్యంగా పని చేశారని అన్నారు. లేబర్ యూనియన్ లీడర్‌గా అనేక పోరాటా నిర్వహించి, మంచి పేరును సంపాదించుకున్నారని స్పష్టం చేశారు. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే నారాయణస్వామి లేని లోటును ఎవరూ తీర్చలేరని అని దేవరకద్ర మండల నాయకులు తెలియజేశారు.

Tags:    

Similar News