చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. బట్టలిప్పి తరిమికొడతాం !
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌పై జరిగిన దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మంగళవారం విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లి పట్టాభిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్, వైసీపీ నేతలపై మండిపడ్డారు. మీ ప్రాణం ఎంత ముఖ్యమో.. మా ప్రాణం అంతే ముఖ్యమని, మీ బూతు మంత్రులు, రౌడీ ఎమ్మెల్యేలకు చెప్పండి, ఇదే రిపీట్ అయితే బట్టలిప్పి తరిమికొడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పట్టాభిపై దాడి జరిగినప్పుడు భద్రత కల్పించి […]
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌పై జరిగిన దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మంగళవారం విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లి పట్టాభిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్, వైసీపీ నేతలపై మండిపడ్డారు. మీ ప్రాణం ఎంత ముఖ్యమో.. మా ప్రాణం అంతే ముఖ్యమని, మీ బూతు మంత్రులు, రౌడీ ఎమ్మెల్యేలకు చెప్పండి, ఇదే రిపీట్ అయితే బట్టలిప్పి తరిమికొడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పట్టాభిపై దాడి జరిగినప్పుడు భద్రత కల్పించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీకి జగన్ జీతం ఇవ్వడం లేదని.. ప్రజలు ఇస్తున్నారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. జవాబుదారీ తనం పోలీసులకు కూడా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నన్ను చంపుతారా ? చంపండి ? ఏమనుకుంటున్నారు. ప్రజలు కన్నెర్ర చేస్తే వైసీపీ నేతలు బయటకి కూడా రాలేరు. 151మంది ఎమ్మెల్యేలు జగన్‌ను కాపాడలేరన్నారు. చట్టం కొందరికి చుట్టం కాదని, డీజీపీ గుర్తు పెట్టుకోవాలన్న చంద్రబాబు… బూతులు తిట్టేవారిని సపోర్టు చేస్తే ప్రజలకు రక్షణ ఉండదని, రౌడీలు, సంఘ విద్రోహ శక్తుల్ని జగన్ తయారు చేస్తున్నారని విమర్శించారు. సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి దాడులపై నిలదీస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంకు వ్యతిరేకంగా మట్లాడిన వాళ్లను వేధిస్తున్నారని, 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తుల్ని చూడలేదన్నారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి కారుపై బాటిల్ విసిరితే నాపై హత్యాయత్నం కేసు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మంగళవారం విజయవాడలోని తన ఇంటి నుంచి పట్టాభిరామ్ పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారును చుట్టుముట్టి.. ఆయనపై దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పట్టాభి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.