ఏపీ ప్రభుత్వం పేదోళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది- బోండా ఉమా

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నవరత్నాలు అని చెప్పి వైసీపీ నవమోసాలు చేసిందని ఆరోపించారు. ఈకేవైసీ ఉంటేనే బియ్యం ఇస్తామని పేదోళ్లను ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. వేలి ముద్రలు మళ్లీ వేస్తేనే బియ్యం ఇస్తామని.. రేషన్ ఎగ్గొడుతున్నారంటూ విమర్శించారు. ట్విటర్ వేదికగా ఈకేవైసీపై స్పందించిన ఆయన రాష్ట్రంలో పేదలంతా ఆధార్ సెంటర్ల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాపు […]

Update: 2021-08-18 02:44 GMT

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నవరత్నాలు అని చెప్పి వైసీపీ నవమోసాలు చేసిందని ఆరోపించారు. ఈకేవైసీ ఉంటేనే బియ్యం ఇస్తామని పేదోళ్లను ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. వేలి ముద్రలు మళ్లీ వేస్తేనే బియ్యం ఇస్తామని.. రేషన్ ఎగ్గొడుతున్నారంటూ విమర్శించారు.

ట్విటర్ వేదికగా ఈకేవైసీపై స్పందించిన ఆయన రాష్ట్రంలో పేదలంతా ఆధార్ సెంటర్ల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాపు మహిళలకు కాపు నేస్తం అందరికీ ఇస్తామని చెప్పి కేవలం 25శాతం మందికి మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ చేయూత మహిళలందరికీ ఇస్తామని చెప్పి కేవలం 30శాతం మందికే ఇచ్చారని మండిపడ్డారు. డ్రైవర్లు, రజకులు, టైలర్లుకు ఆసరా అంటూ కోలుకోలేని విధంగా మోసం చేశారంటూ బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News