ఏపీ డెవలప్ కార్పొరేషన్ యాక్ట్‌పై కోర్టుకెక్కిన టీడీపీ ఎమ్మెల్యే

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డెవలప్ కార్పొరేషన్ సెక్షన్ 12 యాక్ట్ 2020ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖలోని ప్రభుత్వ ఆస్తుల తనఖా రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వ ఆదాయం రాజ్యాంగ అధికరణ 266, 204 ప్రకారం కన్సాలిడెట్ ఫండ్‌లో డిపాజిట్ చేయాలన్నారు. టాక్స్, ఇతర ఆదాయాలు కాన్సిడెంట్ ఫండ్‌లో జమ చెయ్యకుండా కార్పొరేషన్‌కు తరలించడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషనర్ […]

Update: 2021-07-01 05:37 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డెవలప్ కార్పొరేషన్ సెక్షన్ 12 యాక్ట్ 2020ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖలోని ప్రభుత్వ ఆస్తుల తనఖా రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వ ఆదాయం రాజ్యాంగ అధికరణ 266, 204 ప్రకారం కన్సాలిడెట్ ఫండ్‌లో డిపాజిట్ చేయాలన్నారు. టాక్స్, ఇతర ఆదాయాలు కాన్సిడెంట్ ఫండ్‌లో జమ చెయ్యకుండా కార్పొరేషన్‌కు తరలించడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషనర్ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయాన్ని కన్సాలిడేట్ ఫండ్‌లో జమచేయకుండా ఏపీ డెవెలప్ కార్పొరేషన్‌కు మళ్లించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News