జగన్ మూల్యం చెల్లించక తప్పదు : యనమల

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తైన నేపథ్యంలో ఇవాళ ఏర్పాటు చేసిన జనభేరి మహాసభకు హాజరుకాకుండా జగన్ ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోందని ఆరోపించారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేయడం సీఎం జగన్ రెడ్డి పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు. అంతేగాకుండా దీనికి తగిన మూల్యం జగన్ […]

Update: 2020-12-17 03:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తైన నేపథ్యంలో ఇవాళ ఏర్పాటు చేసిన జనభేరి మహాసభకు హాజరుకాకుండా జగన్ ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోందని ఆరోపించారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేయడం సీఎం జగన్ రెడ్డి పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు. అంతేగాకుండా దీనికి తగిన మూల్యం జగన్ చెల్లించక తప్పదని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ అణచివేత చర్యలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందని సూచించారు. రాజధాని ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుతుందని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News