మంత్రి క్షమాపణ చెప్పాలి : లచ్చన్న మనుమరాలు
దిశ, విశాఖపట్నం: స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పల రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత, లచ్చన్న మనుమరాలు గౌతు శిరీష డిమాండ్ చేశారు. గౌతు లచ్చన్నపై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
దిశ, విశాఖపట్నం: స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పల రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత, లచ్చన్న మనుమరాలు గౌతు శిరీష డిమాండ్ చేశారు. గౌతు లచ్చన్నపై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న చరిత్ర తెలుసుకుని మంత్రి మాట్లాడాలని, తాము రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నా, మంత్రి క్షమాపణ చెప్పకుండా మొండి వైఖరితో ముందుకు వెళుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ విగ్రహ రాజకీయాలు ఎవరూ చేయడం లేదని అన్నారు. విగ్రహ రాజకీయాలు చేస్తే మొదట వైసీపీ ప్రభుత్వంతోనే వస్తుందన్నారు. లచ్చన్నకు కుల, మత, ప్రాంతం, పార్టీ లేదన్నారు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడని, ప్రజలు, రైతుల కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసి, వెనక్కి తీసుకోకుండా మొండివైఖరితో ముందుకు పోతున్నారని విమర్శించారు. మంత్రి నోటిని అదుపులోపెట్టుకొని మాట్లాడాలని శిరీష హెచ్చరించారు.