తాడేపల్లిలో జగన్ ఫిడేలు వాయించుకుంటున్నారు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. కరోనాకు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే తాడేపల్లిలో జగన్ ఫిడేలు వాయించుకుంటున్నారని ఆరోపణలు చేశారు. రోజుకు 10వేలకు పైగా కరోనా కేసులు, వంద మరణాలు సంభవిస్తున్నాయన్నారు. దుర్ముహూర్తం చూసుకొని ప్రజా వేదిక కూల్చారని, వికేంద్రీకరణ అనే అందమైన మాట వెనక జగన్ విషం చిమ్మారన్నారు. ప్రజలను 21శతాబ్ధం నుంచి 14శతాబ్దానికి తీసుకెళ్లారని విమర్శలు చేశారు. అటు 34శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు 24శాతానికి […]

Update: 2020-08-15 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. కరోనాకు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే తాడేపల్లిలో జగన్ ఫిడేలు వాయించుకుంటున్నారని ఆరోపణలు చేశారు. రోజుకు 10వేలకు పైగా కరోనా కేసులు, వంద మరణాలు సంభవిస్తున్నాయన్నారు. దుర్ముహూర్తం చూసుకొని ప్రజా వేదిక కూల్చారని, వికేంద్రీకరణ అనే అందమైన మాట వెనక జగన్ విషం చిమ్మారన్నారు. ప్రజలను 21శతాబ్ధం నుంచి 14శతాబ్దానికి తీసుకెళ్లారని విమర్శలు చేశారు. అటు 34శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు 24శాతానికి తగ్గించి కక్ష తీర్చుకున్నారని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేశారని అన్నారు.

ఈ-రక్షాబంధన్, దిశ చట్టం ప్రచారం తప్ప న్యాయం జరగలేదన్నారు. నాటు సారా, శానిటైజర్ తాగి ప్రజలు చనిపోవడం సర్కారు హత్యలేనన్నారు. చెత్త బ్రాండ్లతో ప్రజల రక్తం తాగుతూ రూ.25వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. దళితులపై దమనకాండ కొనసాగుతోందని యువకుడు నక్సల్స్‌లో చేరాలనుకునే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వ ప్రతిష్ఠ మంటగలిసిందన్నారు.

Tags:    

Similar News