‘ఏపీలో జగన్ రౌడీ రాజ్యం’
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో వైఎస్ జగన్ రౌడీ రాజ్యం నడుస్తుంది అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రోజుకో దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమత్తు పని చేస్తున్న దళితుడైన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్ పై వైసీపీ నాయకుడు రమేష్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడాడు.. అంటూ, దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ ట్విట్టర్లో షేర్ చేశాడు. శిరోముండనం, చంపడం, […]
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో వైఎస్ జగన్ రౌడీ రాజ్యం నడుస్తుంది అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రోజుకో దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమత్తు పని చేస్తున్న దళితుడైన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్ పై వైసీపీ నాయకుడు రమేష్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడాడు.. అంటూ, దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ ట్విట్టర్లో షేర్ చేశాడు.
శిరోముండనం, చంపడం, వేధింపులు, దాడులకు పాల్పడుతూ దళితుల పై దమనకాండ కొనసాగిస్తున్నారు అని విమర్శలు చేశారు. దళితులపై దాడులకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.