విశాఖవాసులు అలాంటి రాజధాని కోరలేదు
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి చిన్నరాజప్ప ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రంలో మూడు రాజధానులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విమర్శించారు. విశాఖలో భూములు కొల్లగొట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన స్థానిక సంస్థల నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. విశాఖ ప్రజలు రాజకీయ రాజధాని కోరలేదని, ఆర్థిక రాజధాని కోరారని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మారుస్తారన్నడం దారుణమన్నారు. ఇది విభజన చట్టానికి వ్యతిరేకమని చినరాజప్ప పేర్కొన్నారు. అమరావతిని […]
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి చిన్నరాజప్ప ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రంలో మూడు రాజధానులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విమర్శించారు. విశాఖలో భూములు కొల్లగొట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన స్థానిక సంస్థల నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. విశాఖ ప్రజలు రాజకీయ రాజధాని కోరలేదని, ఆర్థిక రాజధాని కోరారని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మారుస్తారన్నడం దారుణమన్నారు. ఇది విభజన చట్టానికి వ్యతిరేకమని చినరాజప్ప పేర్కొన్నారు. అమరావతిని నాశనం చేయాలన్న జగన్ కుట్రలు ఫలించవని చినరాజప్ప హెచ్చరించారు.