వృద్ధుడి వేషంలో టీడీపీ నేత.. షాక్ ఇచ్చిన వైసీపీ నేతలు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పింఛన్‌లపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులుగా ఉన్న వృద్ధులకు వైసీపీ నాయకులు పింఛన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని పదేపదే ఆరోపిస్తోంది. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ వినూత్న నిరసన తెలిపారు. కడప జిల్లా రైల్వే కోడూరు ఎంపీడీవో కార్యాలయానికి ఆయన వృద్ధుడి వేషంలో వెళ్లి ఎంపీడీవోకి వినతిపత్రం […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పింఛన్‌లపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులుగా ఉన్న వృద్ధులకు వైసీపీ నాయకులు పింఛన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని పదేపదే ఆరోపిస్తోంది. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ వినూత్న నిరసన తెలిపారు.
కడప జిల్లా రైల్వే కోడూరు ఎంపీడీవో కార్యాలయానికి ఆయన వృద్ధుడి వేషంలో వెళ్లి ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. టీడీపీకి మద్దతుదారులుగా ఉన్న వృద్ధులకు ఎటువంటి అన్యాయం జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయాలని వినతిపత్రంలో కోరారు. ఆ సమయంలో నరసింహ ప్రసాద్‌ని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు.
టీడీపీ హయాంలో ఇంతకన్నా తక్కువ పింఛన్లు వచ్చాయని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు పింఛన్ రాకుండా నాడు టీడీపీ నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువురుని బుజ్జగించడంతో పరిస్థితి సద్దుమణిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.