‘అది జగన్ చేదోడు కాదు.. జగన్ చేతి వాటం పథకం’

దిశ, ఏపీ బ్యూరో: ఆంధప్రదేశ్ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీల సంక్షేమం కోసం చేపట్టిన ‘జగనన్న చేదోడు’ పథకంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పథకం ‘జగనన్న చేదోడు పథకం కాదని… జగన్ చేతివాటం పథకమనిై’ ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరిట నాయీ బ్రాహ్మణ, రజక, దర్జీలను జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 5.50 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు ఉంటే.. కేవలం 38 వేల మందికి మాత్రమే […]

Update: 2020-06-10 09:25 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధప్రదేశ్ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీల సంక్షేమం కోసం చేపట్టిన ‘జగనన్న చేదోడు’ పథకంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పథకం ‘జగనన్న చేదోడు పథకం కాదని… జగన్ చేతివాటం పథకమనిై’ ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరిట నాయీ బ్రాహ్మణ, రజక, దర్జీలను జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 5.50 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు ఉంటే.. కేవలం 38 వేల మందికి మాత్రమే డబ్బులు ఇవ్వడం ద్రోహం కాదా? అని ప్రశ్నించారు.

అలాగే రాష్ట్రంలో 15 లక్షల మంది రజకులు ఉంటే కేవలం 82,347 మందికి సాయం చేయడం మోసం కాదా? అని నిలదీశారు. 13 లక్షల మంది దర్జీలు ఉంటే కేవలం 1,25,926 మందికి మాత్రమే లబ్ధిని చేకూర్చడం అన్యాయం కాదా? అని అడిగారు. జగన్ ముంత ఇచ్చి చెంబు లాక్కుంటున్న జిత్తులమారి అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించారని ఆయన విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ నుంచి రూ. 3,634 కోట్లను దారి మళ్లించి… బీసీలకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News