సీఎం జగన్ ఆ విషయం చెప్పాల్సిందే -గౌతు శిరీష

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విరుచుకుపడ్డారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిశా చట్టం తెచ్చామంటుంది, అయితే ఎంత మంది దోషులకు 21 రోజుల లో శిక్ష విధించారో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రెండు సంవత్సరాలలో ఎంత మంది ఆడ బిడ్డలకు న్యాయం చేసారో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు వివరించాలని ఆమె […]

Update: 2021-08-24 02:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విరుచుకుపడ్డారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిశా చట్టం తెచ్చామంటుంది, అయితే ఎంత మంది దోషులకు 21 రోజుల లో శిక్ష విధించారో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రెండు సంవత్సరాలలో ఎంత మంది ఆడ బిడ్డలకు న్యాయం చేసారో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు వివరించాలని ఆమె డిమాండ్ చేశారు.

హంగు ఆర్భాటాలతో దిశా చట్టం తీసుకొచ్చారని, ఆ చట్టం ఇంతవరకు చట్ట బద్దత కాలేదనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మహిళకు మహిళా హోమంత్రి పదవి ఇస్తే కనీసం ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది అనుకున్నామని, కానీ ఉపయోగం లేకుండా పోయిందని, రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు సంవత్సరాల పాప నుండి అరవై సంవత్సరాల మహిళల వరకు ఈ ప్రభుత్వంలో రక్షణ కరువయిందంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు. రమ్యకు జరిగిన అన్యాయం పై గత వారం రోజులుగా టీడీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రమ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రమ్య పై దాడి చేసిన హంతకుడు దొరికాడు కాబట్టి ఇప్పటికైనా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News