తిరుపతిలో రిగ్గింగ్‌కు వైసీపీ యత్నం : చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అక్రమాలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో బయటివ్యక్తులు చొరబడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో చెక్‌పోస్టుల వద్ద సరైన నిఘా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌లో అక్రమాలకు పాల్పడేందుకు చీకటి మంతనాలు జరుపుతున్నారని ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేసేందుకు […]
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అక్రమాలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో బయటివ్యక్తులు చొరబడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో చెక్‌పోస్టుల వద్ద సరైన నిఘా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌లో అక్రమాలకు పాల్పడేందుకు చీకటి మంతనాలు జరుపుతున్నారని ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తు్న్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర బలగాలను మోహరించి బయటివక్తులను నియంత్రించాలన్న చంద్రబాబు డిమాంద్ చేశారు.