బొగ్గు గనులను ప్రైవేటీకరించొద్దు : కవిత

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని బొగ్గు గనుల క్షేత్రాలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ఎదుట టీఎస్ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం నేతలు ఆందోళన చేపట్టి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఆ […]

Update: 2020-06-26 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని బొగ్గు గనుల క్షేత్రాలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ఎదుట టీఎస్ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం నేతలు ఆందోళన చేపట్టి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఆ పరిసరాల్లో భారీగా మొహరించారు.

Tags:    

Similar News