కమర్షియల్ వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహన ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ పెంపు 2.5 శాతంగా నిర్ణయించామని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమలవుతుందని కంపెనీ వెల్లడించింది. మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలు, లైట్ కమర్షియల్ వెహికల్, స్మాల్ కమర్షియల్ వెహికల్, బస్సు ల ధరలకు ఈ పెంపు వర్తిస్తుందని, వీటిలో వాహన మోడల్, వేరియంట్‌ని బట్టి మార్పులుంటాయని కంపెనీ తెలిపింది. ‘స్టీల్, […]

Update: 2021-12-06 07:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహన ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ పెంపు 2.5 శాతంగా నిర్ణయించామని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమలవుతుందని కంపెనీ వెల్లడించింది. మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలు, లైట్ కమర్షియల్ వెహికల్, స్మాల్ కమర్షియల్ వెహికల్, బస్సు ల ధరలకు ఈ పెంపు వర్తిస్తుందని, వీటిలో వాహన మోడల్, వేరియంట్‌ని బట్టి మార్పులుంటాయని కంపెనీ తెలిపింది.

‘స్టీల్, అల్యూమినియం, ఇతర విలువైన లోహాల వంటి పరికరాల ధరలు పెరగడం, ఇతర ముడి పదార్థాల వంటి ఇన్‌పుట్ వ్యయం అధికమవుతున్న కారణంగానే పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాము. సంస్థలో వివిధ స్థాయిలలో పెరిగిన ఖర్చులను అధిగమించేందుకు, తయారీ, మొత్తం ఇన్‌పుట్ ఖర్చులను భరించేందుకే స్వల్పంగా 2 శాతం మేర ధరలు పెంచినట్టు’ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో వివరించింది. కాగా, ఇప్పటికే మారుతి సుజుకి, ఆడి, హోండా వంటి పలు దిగ్గజ వాహన తయారీ కంపెనీలు వచ్చే ఏడాది నుంచి ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News