టాటా నుంచి మరో SUV వెహికిల్ : టాటా టియాగో ఎన్ఆ‌ర్‌జీ

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు టియాగోను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టియాగోకు కొత్తగా ఎస్‌యూవీలా కనిపించే విధంగా టియాగో ఎన్ఆర్‌జీగా తీసుకొచ్చారు. దీని ప్రారంభ ధర రూ. 6.57 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించామని, ఎస్‌యూవీ మోడల్ మాదిరిగానే గ్లౌండ్ క్లియరెన్స్ అధికంగా ఉంటూనే, రూఫ్ రైల్స్, పెద్ద టైర్లను ఈ కారులో అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘టాటా టియాగో […]

Update: 2021-08-04 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు టియాగోను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టియాగోకు కొత్తగా ఎస్‌యూవీలా కనిపించే విధంగా టియాగో ఎన్ఆర్‌జీగా తీసుకొచ్చారు. దీని ప్రారంభ ధర రూ. 6.57 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించామని, ఎస్‌యూవీ మోడల్ మాదిరిగానే గ్లౌండ్ క్లియరెన్స్ అధికంగా ఉంటూనే, రూఫ్ రైల్స్, పెద్ద టైర్లను ఈ కారులో అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘టాటా టియాగో శక్తివంతంగా, ప్రస్తుత మార్కెట్లో ఉన్న ఎస్‌యూవీ లాంటి లుక్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

ఈ మోడల్ బాడీని పటిష్టంగా తయారు చేశామని, కారు లోపలి భాగంలో ఫీచర్ లోడ్, స్టైలిష్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు టాటా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ విభాగం వైస్-ప్రెసిడెంట్ రాజన్ వివరించారు. టియాగో ఎన్ఆర్‌జీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌తో వస్తుందని, 5స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషిన్‌, 181 ఎమెం గ్రౌండ్ క్లియరెన్స్, 15 అంగుళాల టైర్లతో వస్తుందని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ పరంగా పుష్ బటన్ స్టార్ట్, బ్లాక్ ఇంటీరియర్స్, రియర్ పార్కింగ్ కెమెరాతో పాటు ఆటోఫోల్డ్ ఓఆర్‌వీఎం లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు మార్కెట్లో టియాగో మోడల్ చాలామంది వినియోగదారులను ఆకట్టుకుంది. కొత్తగా తెచ్చిన టియాగో ఎన్ఆర్‌జీ కూడా కస్టమర్లకు ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం భారత ఆటో పరిశ్రంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 43 శాతం హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్లు ఉన్నాయి. వీటి అమ్మకాల్లో టాటా మోటార్స్ సంస్థ 46 శాతం వాటాను కలిగి ఉంది. అదేవిధంగా టాటా మోటార్స్ ఇప్పటివరకు మొత్తం 3.5 లక్షల యూనిట్ల టాటా టియాగో కార్లను విక్రయించింది.

Tags:    

Similar News