టాటా నుంచి కరోనా టెస్ట్ కిట్

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్‌ను తక్కువ వ్యవధిలో గుర్తించేందుకు దేశీయ దిగ్గజ టాటా గ్రూప్ పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన కరోనా కిట్‌లను సోమవారం ప్రారంభించింది. ఈ టెస్ట్ కిట్ కేవలం 90 నిమిషాల్లో శరీరంలోని కరోనా వైరస్ ఉనికిని కనిపెడుతుందని, ఇది ఇప్పటివరకు ఉన్న వాటికంటే సమర్థవంతంగా, విశ్వసనీయంగా పనిచేయనున్నట్టు టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని […]

Update: 2020-11-09 10:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్‌ను తక్కువ వ్యవధిలో గుర్తించేందుకు దేశీయ దిగ్గజ టాటా గ్రూప్ పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన కరోనా కిట్‌లను సోమవారం ప్రారంభించింది. ఈ టెస్ట్ కిట్ కేవలం 90 నిమిషాల్లో శరీరంలోని కరోనా వైరస్ ఉనికిని కనిపెడుతుందని, ఇది ఇప్పటివరకు ఉన్న వాటికంటే సమర్థవంతంగా, విశ్వసనీయంగా పనిచేయనున్నట్టు టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ వెల్లడించింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ సరికొత్త కిట్‌ను ఆవిష్కరించినట్టు కంపెనీ సీఈవో గిరీష్ కృష్ణమూర్తి తెలిపారు. 90 నిమిషాల్లో కరోనా వైరస్ ఉనికిని గుర్తించే ఈ కిట్‌కు ప్రభుత్వం ఆమోదం లభించిందని, చెన్నైలో ఉన్న టాటా ప్లాంట్‌లో దీని తయారీ జరిపినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా, నెలకు 10 లక్షల టెస్ట్ కిట్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తాము కలిగి ఉన్నామని, దేశవ్యాప్తంగా ఈ పరీక్షను అందుబాటులోకి తెచ్చేందుకు ఆసుపత్రులు, పలు డయాగ్నస్టిక్ సెంటర్లతో భాగస్వామ్యం కోసం చూస్తున్నామన్నారు. డిసెంబర్ నాటికి ఈ కిట్‌లను అందుబాటులోకి తెస్తామని గిరీష్ తెలిపారు.

Tags:    

Similar News