ఎంఐఎం నేత ఇంట్లో దాడులు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని భర్కత్ పుర కాలనీలోని ఎంఐఎం నేత ఇంటిపై టాస్క్‎ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. సీపీ కార్తీకేయ అదేశాల మేరకు సీఐ షాకీర్ ఆలీ, తన సిబ్బందితో కలిసి ఎంఐఎం నేత, వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ ఎన్ఆర్ఐ జావిద్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.12 లక్షలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జావిద్‎పై కేసు నమోదు చేసినట్లు పోలీసుల […]

Update: 2020-10-21 01:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని భర్కత్ పుర కాలనీలోని ఎంఐఎం నేత ఇంటిపై టాస్క్‎ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. సీపీ కార్తీకేయ అదేశాల మేరకు సీఐ షాకీర్ ఆలీ, తన సిబ్బందితో కలిసి ఎంఐఎం నేత, వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ ఎన్ఆర్ఐ జావిద్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.12 లక్షలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జావిద్‎పై కేసు నమోదు చేసినట్లు పోలీసుల వెల్లడించారు.

ఇటీవల నిజామాబాద్‎లో గుట్కా విక్రయాల వ్యవహరంలో జావిద్ పేరు తెర మీదకు వచ్చినా.. స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. నగరంలో నిషేధిత గుట్కా, తంబాకు తయారీ విక్రయాల్లో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం నేతల హస్తం ఉందని మరోసారి బహిర్గతం అయ్యింది.

Tags:    

Similar News