డప్పులమోతతో దద్దరిల్లిన ట్యాంక్‌బండ్

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితుల అభ్యన్నతికి తీసుకొచ్చిన దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌లో మంగళవారం డప్పుల మోత కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం నుంచి డప్పుల మోతతో వందలాది మంది ర్యాలీగా ట్యాంక్ బండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌చుగ్, స్టేట్ చీఫ్ బండి […]

Update: 2021-11-09 06:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితుల అభ్యన్నతికి తీసుకొచ్చిన దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌లో మంగళవారం డప్పుల మోత కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం నుంచి డప్పుల మోతతో వందలాది మంది ర్యాలీగా ట్యాంక్ బండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌చుగ్, స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాల్గొని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులర్పించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తక్షణమే దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం అవసరమైతే తల నరుక్కోవడానికైనా సిద్ధమన్నారు. నా తల ఆరు ముక్కలు కాదు.. అరవై ముక్కలైనా సరే కేసీఆర్‌ను ఎప్పుడు టచ్‌ చేయాలో అప్పుడే టచ్‌ చేస్తామని బండి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్‌, విజయశాంతి, రాజాసింగ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News