ప్రతీ సంక్షోభం అవకాశమిస్తుంది: గవర్నర్
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రతీ సంక్షోభ సమయం కొన్ని అవకాశాలను ఇస్తుందని, వాటిని ఉపయోగించుకుని దేశానికి సేవ చేసేందుకు ప్రయత్నించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. చెన్నైలోని రాజలక్ష్మి టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ తొమ్మిదో వార్షికోత్సవంలో బుధవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ మాట్లాడుతూ సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మన దేశానికి అద్భుతమైన చరిత్ర ఉందని, మనుషులు ఎదుర్కుంటున్న సమస్యలపై కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. అన్నా యూనవర్సిటీలో 450 మంది విద్యార్థిలకు డిగ్రీ […]
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రతీ సంక్షోభ సమయం కొన్ని అవకాశాలను ఇస్తుందని, వాటిని ఉపయోగించుకుని దేశానికి సేవ చేసేందుకు ప్రయత్నించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. చెన్నైలోని రాజలక్ష్మి టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ తొమ్మిదో వార్షికోత్సవంలో బుధవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ మాట్లాడుతూ సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మన దేశానికి అద్భుతమైన చరిత్ర ఉందని, మనుషులు ఎదుర్కుంటున్న సమస్యలపై కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. అన్నా యూనవర్సిటీలో 450 మంది విద్యార్థిలకు డిగ్రీ పట్టా ప్రధానోత్సవం కార్యక్రమంలోనూ గవర్నర్ పాల్గొన్నారు. చైనా, యూఎస్ఏ తర్వాత మన దేశమే అతిపెద్ద ఉన్నత విద్యావ్యవస్థను అందిస్తోందన్నారు. ఓటమి గురించి విద్యార్థులు భయపడొద్దని, రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్ అని ఆమె అభిప్రాయ పడ్డారు.