తల్లీ, కూతురుతో ఎఫైర్.. 13 ఏళ్ల బాలికకు తండ్రైన 50 ఏళ్ల కీచకుడు

దిశ, వెబ్‌డెస్క్: అతడో బస్సు డ్రైవర్.. క్లీనర్ తో కలివిడిగా ఉండటం మానేసి అతని భార్యపైనే కన్నేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను భర్త నుంచి దూరం చేశాడు. సరే ఆమెతోనైనా సరిగా ఉన్నాడంటే  అది లేదు.. కామంతో కళ్లుమూసుకుపోయిన డ్రైవర్ ఆమె కూతురు పై కన్నేశాడు. వరుసకు తండ్రి అవుతాను అనే ఆలోచన లేదు.. అరే చిన్న పిల్ల అనే విచక్షణ లేదు. తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యచారానికి పాల్పడ్డాడు. చివరకు కూతురిని […]

Update: 2021-07-08 07:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: అతడో బస్సు డ్రైవర్.. క్లీనర్ తో కలివిడిగా ఉండటం మానేసి అతని భార్యపైనే కన్నేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను భర్త నుంచి దూరం చేశాడు. సరే ఆమెతోనైనా సరిగా ఉన్నాడంటే అది లేదు.. కామంతో కళ్లుమూసుకుపోయిన డ్రైవర్ ఆమె కూతురు పై కన్నేశాడు. వరుసకు తండ్రి అవుతాను అనే ఆలోచన లేదు.. అరే చిన్న పిల్ల అనే విచక్షణ లేదు. తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యచారానికి పాల్పడ్డాడు. చివరకు కూతురిని కూడా తల్లిని చేశాడు. ఇక విషయం తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారయ్యాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా దేవందవాక్కం గ్రామానికి చెందిన చరణ్‌రాజ్‌ (50) అనే వ్యక్తి శ్రీపెరంబదూరులోని ప్రైవేటు కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. గత కొంత కాలం క్రితం అతనితో పాటు పనిచేస కుప్పుస్వామి (45) అనే బస్సు క్లీనర్‌ భార్య కౌముదితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న కుప్పు స్వామి భార్యను కట్టడి చేయాలనీ చూశాడు. కానీ, ఆమె మాట వినలేదు. అతడిని వదిలేసి తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి పెద్దకుప్పంలో అద్దె ఇంట్లో చరణ్‌రాజ్‌తో కలిసి కొత్తకాపురం పెట్టింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు సవ్యంగా ఉన్న చరణ్ రాజ్ కన్ను కౌముది కూతురుపై పడింది.

తల్లి ఇంట్లో లేని సమయంలో బాలికను బెదిరించి ఆమెపై అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా బాలిక గర్భం దాల్చిందని వైద్యులు తెలిపారు. వరుసకు తండ్రి అయ్యే చరణ్ రాజ్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పడంతో తల్లి కూతురిని తీసుకొని తిరువళ్లూరు మహిళా పోలీసు స్టేషన్‌లో నాలుగు నెలల కింద ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడ్ని ఇటీవల అరెస్ట్ చేశారు. అనంతరం తిరువళ్లూరు న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. చరణ్‌రాజ్‌ వల్ల గర్భం దాల్చిన బాలిక రెండు వారాల క్రితమే మగబిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం ఇద్దరూ బాలికల సంరక్షణ కేంద్రంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

 

Tags:    

Similar News