కరోనాతో తమిళనాడు సీఎం ప్రైవేటు సెక్రెటరీ మృతి

చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రరూపం దాలుస్తున్నది. రాష్ట్ర సీఎం పళనిస్వామి సీనియర్ ప్రైవేట్ సెక్రెటరీ(56)ని కబళించింది. సుమారు వారం రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. తొలుత అతన్ని ఒమదురర్ ఎస్టేట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(ఆర్‌జీజీజీహెచ్)కి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తిరిగి ఆర్‌జీజీజీహెచ్‌కే పంపించారు. కాగా, ఈ ఆస్పత్రిలోనే పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి చనిపోయాడు. తమిళనాడు సీఎం […]

Update: 2020-06-17 03:46 GMT

చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రరూపం దాలుస్తున్నది. రాష్ట్ర సీఎం పళనిస్వామి సీనియర్ ప్రైవేట్ సెక్రెటరీ(56)ని కబళించింది. సుమారు వారం రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. తొలుత అతన్ని ఒమదురర్ ఎస్టేట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(ఆర్‌జీజీజీహెచ్)కి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తిరిగి ఆర్‌జీజీజీహెచ్‌కే పంపించారు. కాగా, ఈ ఆస్పత్రిలోనే పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి చనిపోయాడు. తమిళనాడు సీఎం కార్యాలయంలో పనిచేసే ఈ సీనియర్ ప్రైవేట్ సెక్రెటరీ కుటుంబం సైదాపేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసముంటున్నది. మృతుడి సహోద్యోగి, తమిళనాడు సెక్రెటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు పీటర్ అంథోనిసామి మాట్లాడుతూ, ఈ మరణం బాధాకరమని, కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని సెక్రెటేరియట్‌లో పనిచేసే స్టాఫ్‌ను 50 శాతం నుంచి 33 శాతానికి తగ్గించాలని, మిగతావారిని బలవంతంగా కార్యాలయానికి పిలవొద్దని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇందులో 50ఏళ్లు పైబడినవారు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారని తెలిపారు. కాగా, సెక్రెటేరియట్‌లో వివిధ ర్యాంకుల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌లు సహా 200 మంది ఉద్యోగులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నట్టు కొన్నివర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News