తమిళ సర్కారుకు.. ఫస్ట్ డే లిక్కర్ కలెక్షన్లు రూ. 172 కోట్లు

చెన్నై: తమిళనాడు సర్కారు ఖజానాకు మద్యం కిక్కు ఎక్కుతోంది. రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్ లిక్కర్ షాపుల ద్వారా ఒక్క రోజులోనే రూ. 172 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఫస్ట్ డే కలెక్షన్ మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 5,146 టాస్మాక్ లిక్కర్ షాపులున్నాయి. సాధారణంగా వీటి ద్వారా రోజుకు అటూ ఇటుగా రూ. 70 నుంచి 80 కోట్ల ఆదాయం వస్తుండేది. కానీ, లాక్‌డౌన్ సడలింపులు వచ్చాక రాష్ట్రంలో కేవలం 3,750 […]

Update: 2020-05-08 06:01 GMT

చెన్నై: తమిళనాడు సర్కారు ఖజానాకు మద్యం కిక్కు ఎక్కుతోంది. రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్ లిక్కర్ షాపుల ద్వారా ఒక్క రోజులోనే రూ. 172 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఫస్ట్ డే కలెక్షన్ మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 5,146 టాస్మాక్ లిక్కర్ షాపులున్నాయి. సాధారణంగా వీటి ద్వారా రోజుకు అటూ ఇటుగా రూ. 70 నుంచి 80 కోట్ల ఆదాయం వస్తుండేది. కానీ, లాక్‌డౌన్ సడలింపులు వచ్చాక రాష్ట్రంలో కేవలం 3,750 టాస్మాక్ షాపులు ఓపెన్ చేసినా.. రూ. 172.59 కోట్ల రాబడి వచ్చింది. ఇందులో అత్యధికంగా మధురైలోని టాస్మాక్ షాపుల ద్వారా ఆదాయం సమకూరింది. ఇక్కడి నుంచి 24 గంటల్లోనే 46.78కోట్ల రాబడి వచ్చింది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మందుకు దూరంగా ఉన్న మద్యంప్రియులు.. లిక్కర్ షాపులు ఓపెన్ చేయగానే పోటెత్తారు. టాస్మాక్ లిక్కర్ షాపుల ముందు వేల మంది మందుబాబులు మద్యం కోసం గుమిగూడారు. క్యూలు కట్టారు. సామాజిక దూరాన్ని పాటించకుండానే మద్యం కోసం ఎగబడ్డారు. దీంతో పోలీసులూ వారిపై లాఠీ చార్జీ చేయక తప్పలేదు. మద్యం షాపుల ముందు భారీగా జనం పోగవడంతో వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు వెలువడ్డాయి. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ.. మద్యం షాపుల ముందు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని సూచించింది. అయినప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. టాస్మాక్ లిక్కర్ షాపులు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

tags: tamil nadu, liquor, tasmac, revenue, sales, collections

Tags:    

Similar News