నేడు ఉదయం 9 గంటలకు స్టాలిన్ ప్రమాణం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి మెజార్టీ సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ను కొత్త ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్, స్టాలిన్‌ను సీఎంగా అపాయింట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అనంతరం ఆయన తన క్యాబినెట్ సభ్యుల జాబితాను […]

Update: 2021-05-06 20:24 GMT

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి మెజార్టీ సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ను కొత్త ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్, స్టాలిన్‌ను సీఎంగా అపాయింట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అనంతరం ఆయన తన క్యాబినెట్ సభ్యుల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. స్టాలిన్‌తోపాటు ఆయన కొలిగ్‌లో మొత్తం 34 మంది సభ్యులున్నారు. కీలకమైన హోం శాఖను స్టాలిన్ తన దగ్గరే ఉంచుకున్నారు. మంత్రుల పోర్ట్‌ఫోలియో జాబితాలో ఉదయనిధి స్టాలిన్ పేరు కనిపించలేదు. కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు.

Tags:    

Similar News