డైలమాలో మిల్కీ బ్యూటీ.. చిరుతో సినిమాకు పేమెంట్ ఇవ్వని మేకర్స్
దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా డైలమాలో పడింది. మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’లో తనను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసిన మేకర్స్.. ఇంకా అడ్వాన్స్ పే చేయలేదట. అయితే అవే డేట్స్‌లో మరో బాలీవుడ్ పిక్చర్ ఆఫర్ రాగా.. ఏ ప్రాజెక్ట్ ఫైనల్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. మరోసారి దీనిపై క్లారిటీ తెచ్చుకునేందుకు ‘భోళా శంకర్’ మేకర్స్‌కు అడ్వాన్స్ సెండ్ చేయాలని కోరినా.. ఇంకా రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. అయితే నార్మల్‌గా […]
దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా డైలమాలో పడింది. మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’లో తనను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసిన మేకర్స్.. ఇంకా అడ్వాన్స్ పే చేయలేదట. అయితే అవే డేట్స్‌లో మరో బాలీవుడ్ పిక్చర్ ఆఫర్ రాగా.. ఏ ప్రాజెక్ట్ ఫైనల్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. మరోసారి దీనిపై క్లారిటీ తెచ్చుకునేందుకు ‘భోళా శంకర్’ మేకర్స్‌కు అడ్వాన్స్ సెండ్ చేయాలని కోరినా.. ఇంకా రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. అయితే నార్మల్‌గా హీరోయిన్‌ను అప్రోచ్ అయ్యాక ప్రాజెక్ట్ ఫైనల్ అయితే వెంటనే అడ్వాన్స్ ఇచ్చేస్తారు.. ఒకవేళ సందిగ్ధంలో ఉంటే మాత్రం పెండింగ్‌లో పెట్టేస్తారు. ఇదే పరిస్థితి ఇప్పుడు తమన్నాకు ఎదురైనట్లు కనిపిస్తోంది. అంతేకాదు రీసెంట్‌గా చిరు ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తికాగా తర్వాత ‘గాడ్ ఫాదర్ ’ షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ‘ భోళా శంకర్’ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడే హీరోయిన్‌ను ఫైనల్ ఎందుకు చేయాలి? అనుకుంటున్నారేమో మేకర్స్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కీలకపాత్రలో కనిపించబోతుండగా.. ఒకవేళ అన్నీ పాజిటివ్‌గా జరిగితే తమన్నా చిరుకు జోడీగా కనిపించనుంది.