ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి

దిశ, మెదక్ : జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో భాగంగా గ్రామ స్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లో‌కి తీసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ (DBF) జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా సమ్మె చేశారనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా 7500ల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారని డీబీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. […]

Update: 2020-04-07 06:22 GMT

దిశ, మెదక్ : జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో భాగంగా గ్రామ స్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లో‌కి తీసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ (DBF) జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా సమ్మె చేశారనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా 7500ల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారని డీబీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. కాబట్టి వారిని వెంటనే విధుల్లోకి తీసుకుని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: feild assistants, take on duty, dbf demand, medak

Tags:    

Similar News